స్పీడ్ పెంచిన ముద్దుగుమ్మ మమితా బైజు

Rajeev 

Images: Pinterest

25 October 2025

 మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం వంటి చిత్రాలలో అల్ఫోన్సా, అంజు, సోనా, గోపిక పాత్రలతో ఆమె గుర్తింపు పొందింది.

ఖో ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.

2024లో విడుదలైన ప్రేమలు చిత్రం ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది.ఇది మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అయ్యింది.

దీంతో ఆమెకు తెలుగు నిర్మాతల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది.

ఇటీవలే డ్యూడ్ అనే సినిమా చేసి హిట్ అందుకుంది. బలమైన కథాపాత్రలు, మంచి స్క్రిప్ట్‌లతో తెలుగులో అడుగుపెట్టాలని భావిస్తోంది.