రూటు మార్చిన కృతిశెట్టి .. ఇటు నుంచి అటు వెళ్తున్న అమ్మడు. 

Rajeev 

31 January 2025

Credit: Instagram

ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఒకరు.

స్టార్ డమ్ వస్తే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవాలి కూడా.. కృతి శెట్టి ఆ విషయంలో కాస్త తడబడిందనే చెప్పాలి. 

ఉప్పెన సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలు కమిట్ అయ్యింది కృతి శెట్టి. అందులో రెండు సినిమాలు హిట్ అయ్యాయి. 

రెండు సినిమాలు హిట్ అయితే.. అరడజనుకు పైగా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో కృతి స్పీడ్ తగ్గించింది. 

ఇటీవలే మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ అమ్మడు నటించిన ఏఆర్ఎమ్ సినిమా హిట్ అయ్యింది. 

దాంతో కృతికి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. కానీ తెలుగులో మాత్రం లేదు. 

అందరూ తెలుగు సినిమాలు చేయాలనీ ఇక్కడికి వస్తుంటే కృతి శెట్టి మాత్రం ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లి అవకాశాలు అందుకుంటుంది.