రోజు రోజుకు ఈ అమ్మడు క్రేజ్ పెరుగుతుందే.. దుమ్మురేపుతున్న దివ్యభారతి

04 March 2025

Rajeev 

 మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి.

ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది.

దీంతో ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. 1992 జనవరి 28న జన్మించింది దివ్యభారతి.

గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది.

బ్యాచిలర్ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. తమిళ్ తో పాటు తెలుగులో సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటుంది. 

మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

ప్రస్తుతం జీవి ప్రకాష్ తో కలిసి కింగ్ స్టన్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.