బీచ్ లో బుజ్జమ్మ వయ్యారాలు.. అదరగొట్టిన అనన్య నాగళ్ల
Rajeev
31 January 2025
Credit: Instagram
అందాల భామ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది.
ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది.
షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. బీచ్ లో చిల్ అవుతున్న ఫోటోలను పంచుకుంది అనన్య