ప్రభాస్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ.. ఇక తిరుగుండదంటున్న ఫ్యాన్స్

Rajeev 

Images: Pinterest

25 October 2025

అదితి రావు హైదరి .. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది.

ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది.ఆతర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.

బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 

సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇన్ స్టాలో 10.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది.

రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. హీరో సిద్దార్థ్ తో పెళ్లి తర్వాత అధితి సినిమాల స్పీడ్ తగ్గించింది.