ఇండియాలోని టాప్ 3 ఐఐటీలు ఇవే.. వీటిల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
04 March 2025
TV9 Telugu
TV9 Telugu
దేశంలోని ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు యేటా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు
TV9 Telugu
ముఖ్యంగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన IIT సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి కంపెనీలు, పరిశోధనా సంస్థలలో పనిచేయడానికి వెళ్ళే గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేయడంలో వీటి పాత్ర ఎనలేనిది
TV9 Telugu
ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు
TV9 Telugu
వీటిల్లో అత్యంత పురాతనమైనది ఐఐటీ ఖరగ్‌పూర్. ఇది 1951లో స్థాపించబడింది. కానీ దేశంలోని టాప్ ఐఐటీల్లో ఇది మాత్రం లేదు
TV9 Telugu
ముఖ్యంగా దేశంలోని 23 ఐఐటీలలో టాప్ 3 ఐఐటీలకు మాత్రమే అత్యంత ఆదరణ ఉంది. అవి ఏవో మీకు తెలుసా? దేశంలోని ఆ టాప్ 3 ఐఐటీల ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
టాప్ స్థానంలో ఐఐటీ మద్రాస్ ఉంది. దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-మద్రాస్‌లో సీటు కోసం పోటీ విపరీతంగా ఉంటుంది
TV9 Telugu
పరిశోధన, అభివృద్ధికి ప్రముఖ కేంద్రంగా ఉన్న ఐఐటీ మద్రాస్‌లో ప్రత్యేకించి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు చాలా డిమాండ్ ఉంది
TV9 Telugu
రెండో స్థానంలో ఐఐటీ ఢిల్లీ ఉంది. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన ఐఐటీ ఢిల్లీ.. యేటా ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతుంది
TV9 Telugu
ఇక మూడో స్థానంలో ఐఐటీ బాంబే ఉంది. ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్‌లో బలమైన కోర్సులకు ప్రసిద్ధి చెందిన ఐఐటీ బాంబే, దేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో స్థిరమైన స్థానం సంపాదించుకుంది