పరీక్షల వేళ.. చదివిన అంశాలు శాశ్వతంగా గుర్తుండాలంటే..!
31 January 2025
TV9 Telugu
TV9 Telugu
అకడమిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి.. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లల స్టడీ టేబుల్, గోడలన్నీ టైమ్‌టేబుల్, కాగితాలు, పుస్తకాలతో నిండిపోతాయి కనిపిస్తాయి
TV9 Telugu
టెక్ట్స్‌బుక్, నోట్స్, ప్రాక్టీసు పేపర్లు... ఒక్కో సబ్జెక్టుకీ ఎంత సరంజామానో! వీటన్నింటి ఎంత ప్రాక్టీసు చేసినా పరీక్ష సమయంలో సమాధానాలు గుర్తురాక ఇబ్బంది పడిపోతుంటారు
TV9 Telugu
జ్ఞాపకశక్తి కుదురుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ. అయితే చదివినవి మరింత బలంగా గుర్తుండిపోవాలంటే మీ మెమరీని బలోపేతం చేయాలి. ఎలాగంటే..
TV9 Telugu
చదివిన అంశాల నుంచి మీకుమీరే ప్రశ్నలు అడుగుకోవాలి. ప్లాష్ కార్డులను ఉపయోగించాలి. స్టడీ మెటీరియల్‌ను చిన్న చిన్న విభాగాలు విభజించి నిర్ధిష్ట టైం పెట్టుకుని ఆలోపు పూర్తి చేసేలా లక్ష్యాలు పెట్టుకోండి
TV9 Telugu
ఈ టెక్నిక్ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కష్టతరమైన విషయాలు గుర్తుంచుకోవడానికి ఎక్రోనింస్, రైమ్స్, విజువల్ ఇమేజరీలను వాడుకోవచ్చు
TV9 Telugu
పెద్ద సమాచారాన్ని చిన్న భాగాలుగా విభజిస్తే మీ మెదడు వాటిని మెరుగ్గా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. అలాగే నేర్చుకున్న అంశాలను ఇతరులతో చర్చించాలి. ఇది కూడా జ్ఞపకశక్తిని పటిష్టం చేస్తుంది
TV9 Telugu
మరొక టెక్నిక్.. మైండ్ మ్యాపింగ్. విషయాన్ని దృశ్యమానంగా నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాన్సెప్ట్‌ల మధ్య కనెక్షన్‌లను రూపొందించి సులభంగా గుర్తుంచుకోవడానికి సహకరిస్తుంది
TV9 Telugu
అలాగే చదివిన విషయాలను విజువలైజేషన్ చేసుకోవాలి. విషయాన్ని దృశ్యమానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చదివిన అంశాలు గుర్తుండాలంటే తగిన విశ్రాంతి, పోషకాహారం తీసుకోకవడం చాలా అవసరం