24 May, 2025
Subhash
క్రెడిట్ కార్డులు నేడు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. అవసరమైన సమయాల్లో వీటిని ఉపయోగిస్తారు.
మీరు క్రెడిట్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే చెల్లింపులు చేయవచ్చు. దానితో మీ ఇంటి అద్దెను కూడా చెల్లించవచ్చు.
క్రెడిట్ కార్డు ద్వారా మీ ఇంటి యజమానికి అద్దె పంపే పద్దతుల గురించి తెలుసుకోండి. దీని ద్వారా క్రెడిట్ కార్డు నుంచే సులభంగా అద్దె చెల్లించవచ్చు.
PayZapp, CRED లేదా Freechrge వంటి విశ్వసనీయ అద్దె చెల్లింపు సేవను ఎంచుకోండి. ఈ ప్లాట్‌ఫామ్స్ అద్దె చెల్లింపు సేవను అనుమతిస్తాయి. వీటి ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
ఎంచుకున్న ప్లాట్‌ఫామ్‌లో సైన్ అఫ్ చేసి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. ఇది అవసరమైన అన్ని నిబంధనలు, షరతులు నెరవేరినట్లు నిర్ధారిస్తుంది.
మీ ఇంటి యజమానిని లబ్దిదారుడిగా జోడించండి. ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి బ్యాంకు వివరాలు నమోదు చేయండి. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.
అద్దె ఒప్పందం ప్రకారం ఖచ్చితమై అద్దె మొత్తాన్ని నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి. ఇది మీ ఇంటి యజమాని బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అవుతుంది.
ఇటీవల బంగారం ధరలు లక్ష రూపాయలకు పైగా ఎగబాకాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా మళ్లీ లక్షకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.