06 June, 2025
Subhash
మీరు మీ మొబైల్ పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ మర్చిపోతే టెన్షన్ పడకండి. దానిని సులభంగా పొందేందుకు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
మీరు మీ మొబైల్‌లో మీ Google అకౌంట్‌లోకి లాగిన్ అయి ఉంటే మీరు మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో కూడా లాగిన్ కావచ్చు. ఇది మీకు వివిధ మార్గాల్లో సహాయపడుతుంది.
మీరు మీ మొబైల్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినప్పుడు అదే గూగుల్ లాగిన్‌తో మరొక మొబైల్ లేదా కంప్యూటర్‌లోకి లాగిన్ అవ్వండి.
సెర్చ్ బార్‌లో Google Find My Device కోసం వెతకండి. అక్కడ మీ Google అకౌంట్‌కు లింక్ చేయబడిన అన్ని డివైజ్‌ల జాబితా కనిపిస్తుంది. మీరు కావాల్సిన ఫోన్ డివైజ్‌ను ఎంచుకోండి.
మీరు మీ మొబైల్‌ను ఎంచుకుని సురక్షితమ డివైజ్‌ను ఎంచుకుని ఆపై ఫోన్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
మీకు Samsung మొబైల్ ఉన్నట్లయితే మీ శాంసంగ్ ఖాతాలోకి లాగిన్ అయి ఉంటే మీరు ఇప్పటికీ మీ మొబైల్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
ఫోన్‌ను అన్‌లాక్ చేయగల థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంది. మీరు వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు Droidkit, PhoneesGo Android Unlocker ఉన్నాయి.
మీ ఫోన్‌ను ఏదీ అన్‌లాక్ చయనప్పుడు చివరి ప్రయత్నం ఫ్యాక్టరీ రీసెట్ చేయడం. దీన్ని ఎలా చేయాలో మీరు Googleలో సమాచారాన్ని కనుగొనవచ్చు.