15 June, 2025
Subhash
ఆధార్.. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న పనికి కూడా ఆధార్ తప్పనిసరి కావాల్సిందే. అన్ని రకాల పనులకు ఆధార్‌కార్డు తప్పనిసరి కావాల్సిందే.
మీ సేవ కేంద్రంలో గానీ, మొబైల్‌లో గానీ ఆన్‌లైన్‌లో ఉచితంంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకుంటే 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇది వరకు జూన్ 14 వరకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ గడువు జూన్14, 2026 వరకు పొడిగించింది.
ఆధార్ కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ విషయంలో ఒక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పుడు జూన్ 14, 2026 వరకు పత్రాల ద్వారా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు.
ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఉపయోగించి లాగిన్ అవ్వండి.
మీ ప్రొఫైల్‌లోని మీ గుర్తింపు (ఐడెంటిటీ), అడ్రస్ వివరాలను సరిచూసుకోండి. ప్రొఫైల్‌లో చూపిన వివరాలు సరైనవని భావిస్తే, 'I verify that the above details are correct' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీరు సమర్పించాలనుకుంటున్న గుర్తింపు పత్రాన్ని డ్రాప్-డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి. మీ గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
ఫైల్ 2 MB కంటే తక్కువ పరిమాణంలో ఉండాలి. ఫైల్ ఫార్మాట్ JPEG, PNG లేదా PDF అయ్యి ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ డ్రాప్-డౌన్ మెనూ నుంచి ఎంచుకోండి.
మీ అడ్రస్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ కూడా ఫైల్ 2 MB కంటే తక్కువ పరిమాణంలో, ఫార్మాట్ JPEG, PNG లేదా PDF అయ్యి ఉండాలి. దీంతో అప్‌డేట్ అవుతుంది.