మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం రేటు ఎంత ఉందో తెలుసా..?

05 May, 2025

Subhash

ఇటీవల బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా లక్ష రూపాయలకు దాటేసింది. కానీ ప్రస్తుతం దిగి వస్తోంది. ఇప్పటి వరకు భారీగానే తగ్గుముఖం పట్టింది.

బంగారం ధరలు

కానీ తగ్గినట్లే తగ్గుతూ మళ్లీ పెరుగుతోంది. మే 5వ తేదీన సాయంత్రం సమయానికి తులం గోల్డ్‌పై 230 రూపాయల వరకు పెరిగింది. అదే ఉదయం తగ్గి ఇప్పుడు పెరిగింది.

మళ్లీ పెరుగుతోంది

ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,750 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 95,730 ఉంది.

ప్రస్తుతం బంగారం ధర 

దేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. 

బంగారం ధరలు

చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.

బంగారం

మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

పెట్టుబడిదారులు

అయితే త్వరలో బంగారం ధరలు దాదాపు 20 వేల రూపాయల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని కొందరు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధరలు 

ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.98,000 వద్ద ఉంది.

ధర పెరిగితే