15 May, 2025
Subhash
జియోలో రెండు ప్లాన్లు ఉన్నాయి. ముఖ్యంగా కాలింగ్, SMS మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారుల కోసం. జియో ఈ రెండు ప్లాన్లు ఉన్నాయి.
రూ.458కి 84 రోజుల చెల్లుబాటుతో, రూ.1958కి 365 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత SMSలు.
దీనితో పాటు, జియో సినిమా, జియో టీవీ వంటి యాప్ లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, SMS మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం.
ఈ ప్లాన్ లో, భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్ మరియు ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం అందించబడుతుంది.
జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.
దీనితో పాటు, 3600 ఉచిత SMS, ఉచిత జాతీయ రోమింగ్ కూడా ఇందులో చేర్చింది జియో.ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్.
జియో ఇప్పుడు తన పాత రీఛార్జ్ ప్లాన్‌లను దాని జాబితా నుండి తొలగించింది. ఇవి ఈ ప్లాన్‌లు రూ.479, రూ.1899.
రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24GB డేటాను అందించగా, రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6GB డేటాను అందించింది.