08 December 2024
Subhash
బ్యాంకు వినియోగదారులకు సిబిల్ స్కోర్ లేకపోయినట్లయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సిబిల్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం.
సిబిల్ స్కోర్ లేనట్లయితే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు సిబిల్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం.
రుణాలు సమయానికి చెల్లించకపోవడం, ఈఎంఐలో ఆలస్యం కావడం తదితర కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాల ఈఎంఐలు, ఇతర చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని గమనించాలి.
ఒక వేళ సిబిల్ స్కోర్ లేకుండా బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే అధిక వడ్డీ ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల పూచికత్తుపై రుణాలు అందిస్తుంటాయి.
సిబిల్ స్కోర్ లేకపోయినట్లయితే బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. బ్యాంకు రుణల్లో వడ్డీ అధికంగా ఉంటుంది.
సిబిల్ స్కోర్ లేకుంటే కారు పై రుణం తీసుకోవాలంటే కూడా బ్యాంకులు, ఇతర సంస్థలు నిరాకరిస్తాయి.
వినియోగదారునికి సరైన సిబిల్ స్కోర్ లేకుంటే బ్యాంకులు ఎప్పుడు కూడా రుణాలు ఇవ్వలేవు. అందుకే సిబిల్ స్కోర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.