ఇక నుంచి పోస్ట్‌ ఆఫీస్‌లో ఇవి మరింత సులభం.. డిజిటల్‌ పద్దతిలో అకౌంట్‌!

06 May, 2025

Subhash

వివిధ రకాల పోస్టాఫీస్‌ పథకాల్లో చేరే ప్రక్రియను భారత తపాలా శాఖ మరింత సులభతరం చేసింది. 

పోస్టాఫీస్‌ పథకాల్లో

మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్, టైమ్‌ డిపాజిట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ లాంటి ఖాతాలను డిజిటల్‌ పద్ధతిలో తెరిచే సదుపాయాన్ని తీసుకొచ్చింది. 

స్కీమ్

కేవలం ఆధార్‌ బయోమెట్రిక్‌ ద్వారా ఆయా ఖాతాలు సులువుగా తెరిచే వెసులుబాటును కల్పించింది. పేపర్‌ వర్క్ అవసరాన్ని పూర్తిగా తప్పించింది.

బయోమెట్రిక్‌

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా తెరవడానికి తపాలాశాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్‌ బేస్డ్‌ ఈ-కేవైసీ విధానాన్ని అనుసరిస్తోంది. 

పోస్టాఫీసు సేవింగ్స్‌

ఏప్రిల్‌ 24 నుంచి దీన్ని మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్ (MIS)‌, టైమ్‌ డిపాజిట్‌ (TD)‌, కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC) లాంటి పాపులర్‌ పథకాలకు విస్తరించింది.

మంత్లీ ఇన్‌కమ్‌

ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. పోస్టాఫీస్‌ కార్యాలయాల్లో ఆయా ఖాతాలన్నీ ఆధార్‌ ఈకేవైసీ సాయంతో సులువుగా తెరవవచ్చని పేర్కొన్నది.

సర్క్యులర్‌

పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఖాతా తెరువనున్నారు. అయితే కొత్తపద్ధతితోపాటు పాత పద్ధతిని కూడా అందుబాటులో ఉంచనున్నారు. 

డిజిటల్‌ విధానం

తర్వాత పేరు, స్కీమ్‌ టైప్‌, డిపాజిట్‌ మొత్తం లాంటి వివరాలు నమోదు చేస్తారు. వివరాలన్నీ ధ్రువీకరించుకున్నాక తుది సబ్మిషన్‌ కోసం మరోసారి ఖాతాదారు నుంచి బయోమెట్రిక్‌ వివరాలు సేకరిస్తారు. 

స్కీమ్‌