06 December 2024
Subhash
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత అందుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు మూడు విడతల్లో రైతులు అందుకుంటున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి 2, 2019న ప్రారంభించారు. 19వ విడత 2025 ఫిబ్రవరి మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశం ఉంది.
ఈ ‘పథకం కింద అర్హులైన వ్యవసాయ కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో రూ.6,000 అందజేస్తున్నారు.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సిస్టమ్‌ని ఉపయోగించి డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపుతోంది.
ఈ పథకం పొందుతున్న రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు వచ్చే విడత నిలిచిపోనుంది.
రైతులు పీఎం కిసాన్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కేవైసీని పూర్తి చేయవచ్చు. యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ-కేవైసీని దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి OTP లేదా వేలిముద్రను ఉపయోగించకుండా మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా పని పూర్తి చేసుకోవచ్చు.