త్వరలో రూ.500 నోట్లు రద్దు అవుతాయా..? కేంద్రం చెప్పిందేమిటి?

07 June, 2025

Subhash

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోట్లు కూడా వంద శాతం బ్యాంకులకు తిరిగి రాలేదని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది.

రూ.2 వేల నోట్లు

ఈ 2 వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 19 మే 2023న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. 

చెలామణి నుంచి 

ఇక త్వరలో దేశంలో రూ.500 నోట్లను (Rs 500 Currency Notes) కూడా ప్రభుత్వం రద్దు చేయనుందంటూ ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది.

దేశంలో రూ.500 నోట్లు

2026 మార్చి నాటికి రూ.500 నోట్లను ఆర్‌బీఐ చెలామణి నుంచి ఉపసంహరించుకుంటుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

రూ.500 నోట్లను 

సోషల్‌ మీడియాలో దీనిపై వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.  2026 మార్చి నాటికి రూ.500 నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో

12 నిమిషాల నిడివిగల ఓ యూట్యూబ్‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ (PIB Fact Check) తాజాగా స్పందించింది.

యూట్యూబ్‌ వీడియో

ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయి. వైరల్‌ అవుతున్న వీడియోలు అబద్దమని స్పష్టం చేసింది.

ఫ్యాక్ట్‌ చెక్‌

ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.

 దేశవ్యాప్తంగా