కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. ఈ కంపెనీ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ బ్యాన్‌

30 June, 2025

Subhash

ఇప్పుడు మీరు భారతదేశంలో పానాసోనిక్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లను పొందలేరు. ఎందుకంటే ఈ కంపెనీ భారత మార్కెట్ నుండి నిష్క్రమిస్తున్నట్లు తెలిపింది

పానాసోనిక్

కంపెనీ మిగిలిన ఉత్పత్తులు అందుబాటులోనే ఉంటాయి. కంపెనీ ఈ నిర్ణయం ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. కానీ ఈ వార్త తర్వాత వర్ల్‌పూల్, వోల్టాస్ షేర్లు పెరిగాయి.

బ్యాడ్‌ న్యూస్‌

రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ విభాగంలో మంచి పట్టు సాధించలేకపోవడంతో జపాన్ కంపెనీ పానాసోనిక్ భారతదేశంలో తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎలక్ట్రానిక్స్

దేశంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల నుండి తాము నిష్క్రమిస్తున్నట్లు పానాసోనిక్ ప్రతినిధి ధృవీకరించారు. హర్యానాలోని ఝజ్జర్‌లోని తన కర్మాగారంలో ఈ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేస్తోంది.

దేశంలో

గ్లోబల్ వ్యూహం, మార్కెట్‌కు అనుగుణంగా భారత్‌లో హోమ్ ఆటోమేషన్, ఏసీ, బిజినెస్-టు-బిజినెస్ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సొల్యూషన్స్ వంటి వృద్ధి విభాగాలపై దృష్టి పెడతామని తెలిపింది.

మార్కెట్‌

మిగిలిన ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి డీలర్లకు సహాయం చేస్తాము. అలాగే కస్టమర్లకు వారంటీ, సర్వీస్ సపోర్ట్‌ను అందిస్తూనే ఉంటామని పానసోనిక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పానసోనిక్

కంపెనీ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతుందని, ఇది రెండంకెలలో ఉండవచ్చని నివేదిక పేర్కొంది. దీని తర్వాత కూడా పానాసోనిక్ భారతదేశంలోని టీవీ, ఏసీ, ఇతర విభాగాలలో పనిచేస్తూనే ఉంటుంది.

ఉద్యోగాలు

పానసోనిక్ దేశంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు.

ఏం విక్రయిస్తుంది?