మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న అంబానీ.. గురు దక్షిణ రూ.151 కోట్లు

09 June, 2025

Subhash

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) తన మంచి మనసు చాటుకున్నారు. 

ముఖేష్‌ అంబానీ 

తాను చదువుకున్న ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి (ICT) గురుదక్షిణగా (Guru Dakshina) భారీ విరాళాన్ని అందించారు. 

గురుదక్షిణగా

ఐసీటీకి రూ.151 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు ముఖేష్‌ అంబానీ. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

రూ.151 కోట్లు విరాళం

విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబానీ.

ప్రొఫెసర్ ఎంఎం శర్మ

ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు. 

ముఖేశ్ అంబానీ

తాను చదువుకున్న రోజులను, ప్రొఫెసర్‌ శర్మతో ఉన్న అనుబంధాన్ని ముఖేష్‌ అంబానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

ముఖేష్‌ అంబానీ 

1970లో ఐసీటీ నుంచి ముఖేష్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నారు. గతంలో దీన్ని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీగా (UDCT) వ్యవహరించేవారు. 

గ్రాడ్యుయేషన్‌ 

2008లో ఈ యూనివర్సిటీని ఐసీటీగా పేరు మార్చారు. ముఖేష్‌ అంబానీ ఈ విధంగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 

యూనివర్సిటీ