ఆధార్ కేవలం ఒక గుర్తింపు కార్డు కాదు, అది ఇప్పుడు ఎమర్జెన్సీ సమయంలో రుణాలు అందించే సూపర్ కార్డ్‌గా మారింది. అత్యవసర సమయాల్లో జస్ట్ 5 నిమిషాల్లో లోన్ ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
TV9 Telugu
దశ 1: దరఖాస్తు (1–2 నిమిషాలు): మీరు లోన్ లేదా బ్యాంక్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ పర్సనల్ లోన్‌పై క్లిక్ చేసి, మీ పేరు, మొబైల్ నంబర్, పాన్, లోన్ మొత్తాన్ని నమోదు చేయాలి. OTP తో మీ మొబైల్‌ను ధృవీకరించాలి.
TV9 Telugu
దశ 2: eKYC (1–2 నిమిషాలు): గతంలో లోన్ కోసం బోలెడు జిరాక్స్ కాపీలు, గంటల కొద్దీ నిరీక్షణ అవసరమయ్యేది. కానీ ఆధార్ ద్వారా e-KYC ప్రక్రియ సాధ్యమైంది. దీంతో నిమిషాల్లో మీ గుర్తింపు, చిరునామాను డిజిటల్‌గా గుర్తిస్తారు.
TV9 Telugu
ఆధార్ నంబర్‌తో ఈజీగా లోన్: ఆధార్ నంబర్ నమోదు చేయండి. ఆ వెంటనే మొబైల్‌లో OTP వస్తోంది. కొంతమంది రుణదాతలు క్రెడిట్ చెక్ కోసం పాన్ కార్డ్ స్నాప్‌షాట్‌ను అడుగుతారు. దీంతో 5 నిమిషాలలోపు వీడియో KYC షెడ్యూల్ పూర్తవుతుంది.
TV9 Telugu
దశ 3: బ్యాంక్ స్టేట్‌మెంట్ లింక్: నికర ఆదాయం, లావాదేవీలు, EMIలు,UPI వినియోగం ఇలా మీరు డిజిటల్‌గా ఎంత యాక్టివ్‌గా ఉన్నారో చెక్ చేస్తారు. అలాగే రిస్క్ ప్రొఫైల్‌ను కూడా చెక్ చేస్తారు.
TV9 Telugu
దశ 4: తక్షణ రుణ ఆఫర్ + eసైన్ (ఒక నిమిషం లోపు): మీ ప్రొఫైల్ ఆధారంగా, మీకు లోన్ ఆఫర్ చూపిస్తుంది. ఇందులో మొత్తం, లోన్ కాలం, వడ్డీ రేటు, EMI బ్రేక్‌డౌన్ ఇలాంటవన్ని చెక్ చేసుకోవాలి. ఆధార్ OTP ఉపయోగించి డిజిటల్ సంతకం చేయాలి.
TV9 Telugu
దశ 5: లోన్ మనీ అకౌంట్‌లోకి: IMPS లేదా UPI ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లోన్ తక్షణమే ఇస్తారు. కొన్ని సెకన్లలోనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
TV9 Telugu
CIBIL స్కోర్ ముఖ్యం: ఆధార్ ఎంత శక్తివంతమైనదైనా, మీ CIBIL స్కోర్ ఇప్పటికీ కీలకమే. మంచి CIBIL స్కోర్ ఉంటేనే మీకు లోన్ త్వరగా, మంచి వడ్డీ రేట్లకు లభించే అవకాశం ఉంటుంది.