ఎల్‌ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ప్రీమియం చెల్లింపులు!

11 May, 2025

Subhash

దేశీయ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ పాలసీ (ఎల్‌ఐసీ)  వినియోగదారుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఎల్‌ఐసీ

ఆన్‌లైన్‌ సేవలను మరింత విసృత పరచడంలో భాగంగా వాట్సాప్‌లో ప్రీమియం చెల్లింపులను జరిపేవిధంగా ‘వాట్సాప్‌ బోట్‌’ సేవలను ఆవిష్కరించింది.

ఆన్‌లైన్‌

దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యంగా చెల్లింపులు చర్యలు చేపట్టింది. దీని వల్ల  వినియోగదారులకు మరింత మేలు జరుగనుంది.

చెల్లింపులు

ఎల్‌ఐసీ కస్టమర్లు తమ ప్రీమియం చెల్లింపులు జరిపేందుకు మరో ప్రత్యామ్నాయం లభించినట్టు అయింది.

ప్రీమియం చెల్లింపులు

పోర్టల్‌లో రిజిస్టర్‌ కస్టమర్‌ నుంచి 8976862090కి వాట్సప్‌ ద్వారా సమాచారం ఇస్తే ఆ పాలసీదారుడికి సంబంధించి మొత్తం వివరాలు వెంటనే రానున్నాయని ఎల్‌ఐసీ తెలిపింది.

వాట్సప్‌ ద్వారా

ఇలా వచ్చిన వివరాల ఆధారంగా యూపీఐ/నెట్‌బ్యాంకింగ్‌/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని కంపెనీ సీఈవో, ఎండీ సిద్దార్థ మోహంతీ తెలిపారు. 

ప్రీమియం

పాలసీదారుడు ఏ సమయంలోనైనా, ఎక్కడి నుంచైనా తమ ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చని సీఈవో, ఎండీ సిద్దార్థ మోహంతీ తెలిపారు. 

పాలసీదారుడు

ప్రస్తుతం ఎల్‌ఐసీ కస్టమర్‌ పోర్టల్‌లో 2.2 కోట్ల మంది రిజిస్టర్‌ పాలసీదారులు ఉండగా, వీరిలో ప్రతీరోజు 3 లక్షల మంది లాగింగ్‌ అవుతున్నారు.

ఎల్‌ఐసీ