07 December 2024
Subhash
యిర్‌టెల్ తన కస్టమర్ల కోసం తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇప్పుడు 365 రోజులు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్ ను అమలు చేసింది. కేవలం రూ.1999తో రీచార్జి చేసుకుంటే ఏడాది పాటు వ్యాలిడిటీ.
ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంటే నెలకు రూ.170 కన్నా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది
ప్రైవేటు టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లలో ఇది అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది.
ఎయిర్ టెల్ అందిస్తున్న కొత్త రీచార్జి ప్లాన్ లో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 24 జీబీ డేటా లభిస్తుంది.
నెలకు 2 జీబీ హై స్పీడ్ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఒక ఎంబీ డేటాకు రూ.50 పైసలు చొప్పున ఖర్చవుతుంది.
ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లేలో ఉచితంగా టీవీ షోలు, చలన చిత్రాలు, లైవ్ చానళ్లకు యాక్సెస్ ఉంటుంది.
మన దేశంలో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. వారందరూ డేటాను చాలా పరిమితంగా వినియోగిస్తారు. అలాంటి వారికి ఈ ప్లాన్ బెస్ట్.