25 May, 2025
Subhash
మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేయడం ద్వారా మంచి నిధిని సృష్టించాలనుకుంటే ఈ వార్త మీ కోసమే.
ప్రతి నెల 4000 జమ చేయడం ద్వారా రూ60 లక్షల నిధిని సృష్టించవచ్చు. దీని కోసం మొదట మీరు ఏదైనా ఫండ్‌లో సిప్ చేయాలి.
మీరు మ్యూచువల్ ఫండ్‌లోని సిప్ ద్వారా రూ.4000 పెట్టుబడితో 60 లక్షల రూపాయలు అవుతుంది. దాని లెక్కింపు ఎలానో చూద్దాం..
మీరు ఒక ఫండ్‌లో 24 సంవత్సరాల పాటు నెలకు రూ.4000 డిపాజిట్ చేస్తే మీ పెట్టుబడి 60 లక్షల రూపాయలు అవుతుంది.
ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ఫండ్‌కు 12 శాతం వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. దీని ద్వారా మంచి రాబడి పొందవచ్చంటున్నారు నిపుణులు.
పెట్టుబడి మొత్తం 24 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.11,52,000 అవుతుంది. అలాగే మొత్తం వడ్డీ రూ.48,81,715 అవుతుంది.
అదే సమయంలో పెట్టుబడి, అలాగే వడ్డీ మొత్తం కలిపితే నిధి రూ. 60,33,715 అవుతుంది. ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి లాభం పొందవచ్చు.
లక్షాధికారి కావాలనుకునే వారికి ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ బాగుంటుంది. అందుకే ఏదైనా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదంటున్నారు.