04 May, 2025
Subhash
2025 సెప్టెంబర్ నాటికి దేశంలోని 75 శాతం ఏటీఎంలో రూ.100, రూ.200 నోట్ను అప్‌లోడ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది.
ఆర్బీఐ ఈ సూచనలతర్వాత రిజర్వ్ బ్యాంకు రూ.500 నోట్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
ప్రజలు రూ.100, రూ.200 నోట్లపై ఆధారపడడాన్ని పెంచాలని ఆర్బీఐ భావిస్తోందని బ్యాంకింగ్ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు ఆశ్వని రాణా తెలిపారు.
నగదు కోసం రూ.500 నోట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని కోరుతోంది. పెద్ద నోట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఆర్బీఐ సూచిస్తోంది.
రూ.2000 నోట్లను చెలామణి నుంచి తొలగించినట్లే రూ.500 నోట్లను కూడా తొలగించబోతున్నారని అశ్వినిరాణా చెబుతున్నారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని, డీజిల్ కరెన్సీ ఈ-రూపాయిని ప్రవేశపెట్టేందుకు ప్రవేశపెట్టడాన్ని ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. దీంతో నోట్ల ముద్రణ ఖర్చు తగ్గుతుంది.
ప్రభుత్వం నోట్ల ముద్రణకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆర్బీఐ చిన్ననోట్లను ఏటీఎంలో ఎక్కువ ఉంచనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చిన్ననోట్లు అందుబాటులో ఉండడమే కాకుండా చిల్లల కష్టాలు తప్పనున్నాయి.