రైల్వే బ్యాడ్‌న్యూస్‌..పెరగనున్న రైల్వే ఛార్జీలు..ఎప్పటి నుంచి అంటే

25 June, 2025

Subhash

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వేస్ బ్యాడ్ న్యూస్ తెలిపింది. టికెట్ ఛార్జీలను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ ధరలు జూలై 1 నుండి అమల్లోకి రానున్నాయి.

బ్యాడ్‌న్యూస్‌

అయితే జూలై 1వ తేదీలోపు టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే పెంచిన ఛార్జీలు ఉండవు. 1 తర్వాతే పెంపు అమల్లోకి వస్తుందని రైల్వే తెలిపింది.

జూలై 1వ తేదీలోపు

అన్ని రైళ్ళలో టికెట్ ఛార్జీల పెంపు ఉండదు. కొన్నింటికి మాత్రమే. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసిలోకి.మీపై ఒక పైసా, ఏసీ కేటగిరిపై కిలో మీటర్ కు 2 పైసలు పెంచుతోంది.

రైల్వే ఛార్జీలు

ఇక సాధారణ ప్రజలు ప్రయాణించే ఆర్డినరీ సెకండ్ క్లాస్ లో 500 కిలోమీటర్ల లోపు ఛార్జీల పెంపు లేదు. అంతకంటే ఎక్కువదూరం ప్రయాణించేవారికి కిలో మీటర్‌కు అరపైస అదనంగా వసూలు చేస్తారు.

ఈ రైళ్ళలో టికెట్ల పెంపు లేదు

ఇక సబర్బన్ రైళ్లలో టికెట్ల పెంపు ఉండదని రైల్వే స్పష్టం చేసింది. రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణించేవారిపై కూడా ఎలాంటి భారం మోపలేదు. నెలవారి సీజన్ టికెట్‌పై ఛార్జీలు పెంచడం లేదని తెలిపారు.

 సబర్బన్ రైళ్లలో

కరోనా సమయంలో భారతీయ రైల్వే తీవ్ర నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలపై ఎలాంటి భారం మోపలేదు. కోవిడ్ 19 తర్వాత మొదటిసారి ఛార్జీలను పెంచారు.

పదేళ్ళలో రెండోసారి

ఈ పెంపు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు, రైల్వే నిర్వహణ కోసం తప్పలేదని భారత రైల్వే శాఖ చెబుతోంది.

మెరుగైన సేవల కోసం 

ఇంతకుముందు 2020 ఆరంభంలోనే సేమ్ ఇప్పటిలాగే అతి తక్కువగా రైల్వే ఛార్జీలు పెంచారు. క్లాసులను బట్టి కిలోమీటర్ కు పైసా నుండి నాలుగు పైసలు పెంచారు. ఈ ఐదేళ్లు ఎలాంటి ఛార్జీల పెంపు లేదు.

ఈ ఐదేళ్లు