02 June, 2025
Subhash
పాత కారు కొనే ముందు దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఒక చిన్న పొరపాటు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కారును తెలివిగా ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ముందుగా కారు బయటి భాగాన్ని తనిఖీ చేయండి. పెయింట్, తుప్పు, గీతలు, ఏదైనా నష్టం ఉందా గమనించండి. బానెట్‌ను కూడా చెక్ చేయండి
కారు టైర్ల పరిస్థితిని చెక్ చేయండి. అన్ని టైర్లు ఒకే పరిమాణంలో ఉండాలి. అరిగిపోయినట్లు కనిపించకూడదు. టైర్లు అరిగిపోవడం సస్పెన్షన్, అలైన్‌మెంట్ సమస్యలను సూచిస్తుంది.
ఇంజిన్ స్టార్ట్ చేసి ధ్వనిపై శ్రద్ద వహించండి. ఏదైనా వింత శబ్దం, పొగ వస్తుందా? కారు బానెట్ లోపల లీకేజీలు, తుప్పు పట్టడం వంటివి ఉన్నాయా? అని చెక్ చేసుకోండి.
కారు లోపలి భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. సీట్లు, సీట్ బెల్టులు, మ్యూజిక్ సిస్టమ్, ఏసీ, ఎలక్ట్రికల్ ఫంక్షన్ల పరిస్థితి సరైన పని స్థితిలో ఉండాలి.
టెస్ట్ డ్రైవ్ తీసుకోవడం మర్చిపోవద్దు. కారు గేర్, షిప్టింగ్, బ్రేకింగ్, స్టీరింగ్, క్లచ్‌ను చెక్ చేసుకోండి. ఏదైనా షాక్, శబ్దం అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.
కారు డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకోండి. ఆర్‌సీ, ఇన్సూరెన్స్, సర్వీస్ రికార్డు, పొల్యూషన్ సర్టిఫికేట్ సరిగ్గా అందుబాటులో ఉండాలి. డూప్లికేట్ ఆర్‌సీని తీసుకోకండి.
ఇలాంటి అంశాలన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయండి. లేకుంటే ఇబ్బందులు పడతారు.