05 June, 2025
Subhash
ఇంట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు దాచుకున్న వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. కానీ అలాంటి వార్తలు చూసినప్పుడు, మనందరికీ వచ్చే సందేహం ఏమిటంటే మనం ఇంట్లో డబ్బు ఉంచుకోకూడదా? అని.
మనం ఇంట్లో డబ్బు ఉంచుకోవచ్చని అంటారు. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితో మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇంట్లో డబ్బు ఉంచుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి నిర్దిష్ట పరిమితిని నిర్ణయించలేదు. కానీ డబ్బుకు సంబంధించి వివరాలు అడుగుతారు.
మీరు ఇంట్లో ఉంచే డబ్బుకు నమ్మకమైన మూలం ఉండాలి. అంటే దానికి సంబంధించిన ఆధారాలు తప్పకుండా ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందుల్లో పడతారు.
మీకు డబ్బు ఎలా వచ్చిందో వివరించగలగాలి. ఈ సమాచారాన్ని మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో చేర్చాలి. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు డబ్బు యొక్క మూలాన్ని మీరు స్పష్టంగా వివరించగలగాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 68 నుండి 69B వరకు వివరించని ఆస్తులు, ఆదాయాన్ని పరిగణిస్తాయి.
మీరు డబ్బుకు సంబంధించిన మూలాన్ని వివరించలేకపోతే, దానిని వెల్లడించని ఆదాయంగా పరిగణిస్తారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు.
అలాంటి సంఘటనలు జరిగితే, పన్నులు, జరిమానాలు విధిస్తారు. మీ నుండి స్వాధీనం చేసుకున్న మొత్తంలో 78 శాతం వరకు జరిమానా విధించవచ్చు.