యువతకు సుందర్ పిచాయ్ సక్సెస్ మంత్ర.. పాటిస్తే విజయం మీదే!

08 october 2025

Samatha

ప్రస్తుతం చాలా మంది యువత సక్సెస్ కోసం తెగ ఆరాటపడుతున్నారు.  అయితే నిజమైన సక్సెస్ అనేది ఎలా ఉంటుంది. సహాద్యోగులతో పని చేసే క్రమంలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి గూగుల్ సీఈవో గురించి తెలిపారు.

నేటి యువతరం తమ జీవితంలో, ఉద్యోగపరంగా,బిజినెస్ పరంగా విజయాన్ని అందుకోవాలి అంటే తప్పకుండా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ టిప్స్ పాటించి, మీ సక్సెస్‌ను చేరుకోగలరు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక యువ ప్రొఫెషనల్ స్పూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తులలో ఈయన ఒకరు. ఇతను తన జీవితంలోని సక్సె్స్ గురించి తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ, యువ ఉద్యోగులు కొత్తగా కెరీర్ ప్రారంభించేవారికి ప్రతీది సవాల్‌తో కూడినదే, కానీ మీరు మీ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వ్యాపారం ప్రారంభించాలి, ప్రతి ఒక్కరితో స్నేహభావంతో మెదలాలి అని తెలిపారు.

మీరు కొంచెం భయపడే పరిస్థితులు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోవాలి, కఫర్ట్ జోన్ చూసుకుంటే ఎప్పుడూ జీవితంలో పైకి రాలేరంటూ తెలిపారు.

ఒక వ్యక్తికి తాము చేసే వృత్తి పట్ల నైపుణ్యం, క్రమ శిక్షణ అవసరమే అయినప్పటికీ, యువత ఆలోచనలను ఎప్పుడూ  విస్మరించవద్దు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంట.

ఎప్పుడూ కూడా ఇతరుల నిర్ణయాలు తీసుకోవడం చేయాలి. వారి నిర్ణయాలను గౌరవిస్తూ.. మీ మనసుకు అది సరైనదే అనిపిస్తుందా కదా అని ఆలోచించాలంట. అప్పుడే సక్సెస్ అవుతారు