మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు..తులం గోల్డ్‌పై ఎంత పెరిగిందో తెలిస్తే..

13 May, 2025

Subhash

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇటీవల లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు.. క్రమంగా దిగి వచ్చాయి.

బంగారం ధరలు

లక్ష రూపాయలకుపైగా ఉన్న బంగారం ధరలు.. 95 వేల రూపాయల వరకు దిగి వచ్చాయి. తాజాగా మరోసారి ఎగబాకింది.

లక్ష రూపాయలు

మే 13వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1,050 రూపాయల వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల ధరపై 1140 రూపాయల వరకు పెరిగింది.

మే 13వ తేదీన

ప్రస్తుతం మే 13న సాయంత్రం 5 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,550 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.96,600 ఉంది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర

అదే 12వ తేదీన ధరలను చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,460 ఉంది.

12వ తేదీన

ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం సమయానికి కిలో వెండిపై 1000 రూపాయిలు తగ్గుముఖం పట్టింది. బంగారం పెరిగితే వెండి తగ్గింది.

వెండి విషయానికొస్తే

ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష రూపాయలలోపే ఉంది. అంటే 97,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో లక్ష రూపాయలకుపైనే ఉంది.

కిలో వెండి ధర 

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88,550 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 96,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో