బంగారంపై రుణం తీసుకునే వారికి ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం

13 June, 2025

Subhash

 బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు ఊరట లభించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక సూచన చేసింది.

బంగారంపై రుణాలు

ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన మార్గదర్శకాల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది. రుణాలపై మరింత సులభతరం చేసింది.

ఆర్బీఐ

ముఖ్యంగా 2 లక్షల వరకు రుణాలు తీసుకునే చిన్న రుణగ్రహీతలను ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయించాలని ఆర్‌బీఐకి సూచించింది. 

రూ.2 లక్షల వరకు

ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆర్‌బీఐ.. ఈ రుణాలపై కొన్ని ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. తనఖా పెట్టుకొని ఇచ్చే రుణ విలువ, ఆ పసిడి విలువలో 75 శాతం కంటే అధికంగా ఉండరాదని పేర్కొంది. 

పసిడి రుణాలపై 

అంటే, రూ. లక్ష విలువైన బంగారానికి రూ. 75 వేల కంటే ఎక్కువ రుణం ఇవ్వకూడదని ఆర్‌బీఐ సూచించింది. ఈ నిబంధన వల్ల చిన్న, సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టమవుతుంది.

రూ.75 వేలు

ఈ నిర్ణయం తమిళనాడులోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం స్టాలిన్.. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 

తమిళనాడులోని

దీంతో చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా కొత్త మార్గదర్శకాలు ఉండాలని,  దీనిలో భాగంగానే రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకొనేవారికి వాటి నుంచి మినహాయించాలని సూచించారు.

బంగారు రుణాలు

కొత్త మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలుచేసేందుకు సమయం పడుతుంది కాబట్టి 2026 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలుచేయాలని ఆర్‌బీఐకి ఆర్థికశాఖ సూచించింది.

కొత్త మార్గదర్శకాలు