09 May, 2025
Subhash
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా వాడితే అప్పులలో కూరుకుపోతారు.
క్రెడిట్ కార్డులపై వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మినిమమ్ అమౌంట్ చెల్లించవద్దు. తర్వాత వడ్డీ చాలా పడుతుంది. ఆలస్య రుసుము చాలా వేస్తాయి.
మీరు సకాలంలో చెల్లింపు చేయకపోతే దానిపై కూడా మీరు నస్టాన్ని భరించాల్సి రావచ్చు. ఆలస్య రుసుములపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.
మీ కార్డు పరిమితి లేదా దానిలో ఎక్కువ భాగం ఖర్చు చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. పరిమితికి మించి వాడితే ఛార్జీలు కూడా వేస్తాయి బ్యాంకులు.
మీరు క్రెడిట్ కార్డు నుంచి ఎప్పుడు కూడా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేయద్దు. దీనిపై భారీగా వడ్డీ పడుతుంది. దీంతో అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
మీరు క్రెడిట్‌కార్డు ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేస్తే చెల్లించేందుకు30-40 రోజుల సమయం ఉంటుంది. ఆ లోగా చెల్లించకుంటే భారీగా వడ్డీ పడుతుంది. దీంతో మీరు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డు వార్షిక రుసుము, విదేశీ లావాదేవీలపై రుసుము, బ్యాలెన్స్ బదిలీ ఛార్జీలు ఇలా అనేక ఛార్జీలు విధిస్తాయి. వేర్వేరు కార్డులపై వేర్వేగా ఈ ఛార్జీలు ఉంటాయని గమనించండి.
ఇలా క్రెడిట్ కార్డు వాడే వారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా లిమిట్ దాటితే భారీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.