30 April 2025
Subhash
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైనవిగా మారిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి.
ఇప్పుడు BSNL తన కస్టమర్ల కోసం రెండు అద్భుతమైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.
ఇవి డేటా, అపరిమిత కాలింగ్, రోజువారీ SMS వంటి సౌకర్యాలను చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి.
ఈ ప్లాన్‌ల ధర రూ. 1,515, రూ.1,499. ఇందులో మీ సగటు నెలవారీ ఛార్జీ రూ. 127 వరకు మాత్రమే వస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1,515 ప్లాన్‌లో 365 రోజులు చెల్లుబాటు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా.
ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ ఉండదు.
ఈ ప్లాన్‌లో ఏడాదిలో మొత్తం 720GB డేటా. ఈ ప్లాన్ నెలకు రూ. 127 మాత్రమే ఖర్చవుతుంది.
ఈ ప్లాన్‌లో 336 రోజులు వ్యాలిడిటీ. మొత్తం 24GB డేటాను అందిస్తోంది.అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు.