మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.? ఇవి తెలియకపోతే.. మీకే నష్టం..
24 September 2025
Prudvi Battula
ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది. ఇతర ఫండ్లలో ఆలా ఉండదు. అందుకే మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేముందు చేసే ముందు ఇది గుర్తు పెట్టుకోండి.
మీ అవసరాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవడం ముఖ్యం. రాబడి మాత్రమే లక్ష్యంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది.
మీ ఆర్థిక లక్ష్యాలను రాసుకుంటే ఎంత సమయం ఉంది. ఎంత మదుపు చేయాలో తెలుస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఉన్న లక్ష్యాలపై కాస్త రిస్క్ తీసుకున్నా పరవాలేదు.
మీ పిల్లల చదువులు లక్ష్యంగా పెట్టుకుంటే నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. అప్పుడు తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లో అంటే బ్యాలన్స్‌డ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
మీ లక్ష్యం 2-3 సంవత్సరాలు ఉంటే ఈక్విటీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఇందులో 70-80 శాతం వరకు మొత్తాన్ని వెనక్కి తీసుకుని బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకోవచ్చు.
మీ నెలవారీ ఖర్చుల్లో కనీసం 4 నుంచి 6 నెలల నిధిని ఒక లిక్విడ్ ఫండ్లలో మదుపు చేసి అత్యవసర పరిస్థితుల్లో వాడండి. ఇందులో బ్యాంకు కంటే 2-3 శాతం ఎక్కువ రాబడి వస్తుంది.
మీరు కొత్తగాపెట్టుబడులు ప్రారంభిస్తే ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. దీనిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. మంచి రాబడి వస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు ఉన్నాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు.