08 December 2024
Subhash
సామాన్యులు సైతం ఇష్టపడే కార్లలో మారుతి సుజుకీ ఒకటి. ఈ కంపెనీ తక్కువ ధరల్లో కార్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది.
ఇప్పుడు తాజాగా మారుతి సుజుకీకి కూడా ఆడి ఇండియా, హ్యుండాయ్ మోటార్ ఇండియా బాటలోనే ప్రయాణిస్తున్నది.
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు నాలుగు శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకీ శుక్రవారం ప్రకటించింది.
మోడల్స్ వారీగా ధరల్లో మార్పులు ఉంటాయని వివరించింది. కార్ల తయారీ ఖర్చులు పెరిగిపోవడంతో కొంత భారం కస్టమర్లపై మోపక తప్పడం లేదని తెలిపింది.
జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయని ఈ నెల ప్రారంభంలోనే ఆడి ఇండియా కూడా ప్రకటించింది.
అన్ని రకాల మోడల్ కార్లపై మూడు శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఆడీ ఏ4, ఆడి క్యూ7, ఆడి ఈ-ట్రాన్ జీటీ, ఆడీ ఆర్ఎస్ క్యూ8 మోడల్ కార్లు అత్యంత పాపులర్.
అన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.25 వేల వరకూ అన్ని కార్ల ధరలు పెంచుతామని గురువారం హ్యుండాయ్ మోటార్స్ ప్రకటించింది.
బ్యాంకు వినియోగదారులకు సిబిల్ స్కోర్ లేకపోయినట్లయితే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సిబిల్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం.