నల్ల ఆవాలు వర్సెస్ తెల్ల ఆవాలు.. తేడా తెలిస్తే..

19  January 2026

Jyothi Gadda

నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు.. ఏది ఆరోగ్యానికి మరింత మంచిది? వాటి మధ్య ఉన్న తేడాలు, ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం..

నల్ల ఆవాలు ఇవి ఘాటుగా, కొంచెం కటువుగా ఉంటాయి. ఇందులో సెలీనియం మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

నల్ల ఆవాలలో ప్రత్యేకించి గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకు సహాయపడతాయి.

తెల్ల ఆవాలు  వీటిని కొన్నిసార్లు పసుపు ఆవాలు అని కూడా అంటారు. ఇవి నల్ల ఆవాల కంటే కొంచెం తక్కువ ఘాటుగా ఉంటాయి.

తెల్ల ఆవాలు ముఖ్యంగా మాగ్నీషియం, ఫైబర్ (పీచు పదార్థం)కు మంచి వనరు. తెల్ల ఆవాలను ఎక్కువగా ఆవాల పేస్ట్ తయారీలో ఉపయోగిస్తారు.

రెండు రకాల ఆవాలు కూడా జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలో మంట తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.

నల్ల ఆవాలలో ఉండే అధిక సెలీనియం కారణంగా కీళ్ల నొప్పులు, మంటలను తగ్గిస్తాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.

తెల్ల ఆవాలు  అజీర్, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. ఇవి ఆవనూనె తీయడానికి కూడా ఉపయోగిస్తారు.