వసంత పంచమి రోజు పిల్లలతో ఇలా ...
20 January 2026
Jyothi Gadda
వసంత పంచమిని మనం ఈసారి జనవరి 23న అంటే శుక్రవారం రోజున జరుపుకోబోతున్నాం. దీన్ని అత్యంత శుభమైనదని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజున దేవుడి కళ్యాణంగా జరుపుతారు. ముఖ్యంగా బ్రహ్మదేవుడి సతీమణి సరస్వతి మాత జయంతిగా జరుపుకుంటాం.
ఉదయాన్నే నిద్రలేచి, స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని దీపారాధన చేసి నిత్యపూజలు మొదలు పెట్టాలి.
వసంత పంచమి రోజంతా కూడా పంచమితిథి ఉంది. వసంత పంచమి రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు.
ఈ రోజున పసుపు రంగు దుస్తులు వేసుకొవాలి. అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి, పులి హోర, సిర మొదలైనవి నైవేద్యంగా సమర్పించుకొవాలి.
ఈ రోజునచదువులో, ఉద్యోగంలో సరైన విధంగా ఎదుగుదల లేని వారు, సరస్వతీ అమ్మవారిని పూజిస్తే వెంటనే అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం.
వసంత పంచమి రోజున ఏపని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా పూర్తవుతుందని, దేవుడికి మామిడి చిగురు, పూవ్వులను అర్పించి ప్రత్యేక పూజలు చేసుకుంటారు.
వసంత పంచమి రోజున మద్యపానం, మాంసాహరం, కలహలకు దూరంగా ఉండాలి. కటింగ్ ,షేవింగ్, గోర్లు కత్తిరించుకొవడం వంటివి అస్సలు చేయకూడదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభమా నష్టమా ?
ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు.. ఆ వ్యాధులకు వణుకే..!
కొబ్బరి పాలతో కోటి లాభాలు..!