Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెడితే డబ్బే డబ్బు..!

21 May 2026

Rajashekher

ప్రస్తుతం చాలామంది ఇంట్లో పచ్చదనం, అందం కోసం కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. వాటిలో మనీ ప్లాంట్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం.

మనీ ప్లాంట్‌ను శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఏర్పాటు చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ పక్కన కిటికీ ఉంటే, దాని దగ్గర మనీ ప్లాంట్ ఉంచి కిటికీలోకి పాకేలా పెంచితే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

మనీ ప్లాంట్ ఎప్పుడూ పైకి పాకేలా చూసుకోవాలి. కిందకు వేలాడేలా ఉండకూడదు. పసుపు రంగు ఆకులు వస్తే వెంటనే తొలగించాలి.

లక్ష్మీ కటాక్షం కోసం ఇంటి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ ఉంచడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి శుక్రవారం మనీ ప్లాంట్‌కు ఎరుపు దారం కట్టి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు బ్లూ కలర్ కుండిలో మనీ ప్లాంట్ పెట్టి, అందులో 11 రూపాయల నాణేలు ఉంచితే ఉద్యోగ ప్రాప్తి కలగవచ్చని చెబుతున్నారు.

ధనలాభం కోసం ఎరుపు రంగు కుండిలో మనీ ప్లాంట్ పెంచడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు ప్రకారం దిశల ప్రభావం కూడా ముఖ్యమే. 

నైరుతిలో ఉంచితే అప్పులు తగ్గుతాయని, వాయువ్యంలో ఉంచితే వ్యాపారం మెరుగుపడుతుందని, ఈశాన్యంలో ఉంచితే మనశ్శాంతి కలుగుతుందని చెబుతున్నారు. అయితే, ఇవన్నీ నమ్మకాలు మాత్రమేనని గమనించాలి.