రేపే మాఘపౌర్ణమి.. తస్మాత్ జాగ్రత్త, పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!
samatha
11 february 2025
Credit: Instagram
రేపే (ఫిబ్రవరి 12)న మాఘపౌర్ణమి . మన హిందూ సాంప్రదాయ ప్రకారంమాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఈ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ మాసంలో నదిస్నానం ఆచరించడం చాలా మంచిదంటారు.
అయితే, ఈ మాసంలో వచ్చే మాఘపౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా, ఈ రోజు అస్సలే కొన్ని పనులు చేయకూడదంట. అవి ఏవంటే?
జ్యోతిషశాస్త్రం ప్రకారం, మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు అస్సలే ధరించకూడదంట. మరీ ముఖ్యంగా ఈ రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొనడం అశుభం అంట.
మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలంట. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయంట
ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, వైన్ మొదలైన వాటిని తినకూడదు అంటున్నారు పండితులు. దీని వలన ఇంట్లో సంపద నశించి అప్పులు పెరుగుతాయంట.
మాఘ పూర్ణిమ రోజున జుట్టు,గోర్లు అసలు కత్తిరించకూడదు. జుట్టు, గోళ్లను కత్తిరించిన తర్వాత, అవి శరీరంలోని చనిపోయిన భాగాలుగా కనిపిస్తాయి.
మాఘ పూర్ణిమకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన ఈ రోజున భక్తి శ్రద్ధలతో మెలగాలంట. ఎవరినీ కించపరిచినట్లు మాట్లాడకూడదంటున్నారు పండితులు.