మౌనీ అమవాస్య : ఈ రాశుల వారికి దశ తిరిగినట్లే..మరి మీ రాశి ఉందా?
samatha.j
23 January 2025
Credit: Instagram
జనవరి 29న మౌని అమావాస్య సంభవించబోతుంది. అన్ని అమావాస్యల్లోకెల్లా ఈ అమావాస్య చాలా మహిమాన్వితమైది అంటారు పండితులు.
ఈ అమవాస్య జనవరి 28 సాయంత్రం 7.35 గంట లకు ప్రారంభం అవుతున్న అమావాస్య తిథి 29వ తేదీ సాయంత్రం 6.05 గంటల వరకూ కొన సాగుతుందంట.
అయితే ఈ అమావాస్య వలన ఐదురాశుల వారికి అదృష్టం కలిసిరానున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
కర్కాట రాశివారు ఈరోజు మౌన వ్రతం పాటించడం వలన వీరి జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. కలలో కూడా ఊహించని పురోగతి అనుభవానికి వస్తుంది. ధన, అధికార, ఉద్యోగ యోగాలు కలుగుతాయి.
మౌని అమావాస్య కారణంగా సింహ రాశి వారు ఒత్తిడి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారంట.. ఈ రాశివారు ఆ రోజున ఉపవాసం ఉండి, ధ్యానం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుందంట.
వృశ్చికం రాశి వారు మౌని అమావాస్యనాడు మౌన వ్రతం, ధ్యానం వంటి చేయడం మంచిది. దీని వలన వీర ఆదాయం వృద్ధి చెందడం, అధికార యోగం కలగడం, మంచి ఉద్యోగం లభించడం, సంతానం కలగడం వంటివి జరుగుతాయంట.
మకరం ఈ రాశివారు మౌని అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం వల్ల అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం రాశి వారికి మౌని అమావాస్య వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రాశివారు అమావాస్య రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల ఏలిన్నాటి శని దోషం తగ్గిపోయే అవకాశం ఉంది.