సంక్రాంతి పండగ వేళ, ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం?

07 January 2025

TV9 TELUGU

సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

పండగకు చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీంతో విపరీతంగా రద్ధీ పెరిగిపోతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రోడ్డు రవాణా శాఖ అదనపు బస్సులు నడపడానికి నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఆర్టీసీ ఎండీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అదనపు బస్సులు నడపాలని సూచనలు జారీ చేశారు.

 ఇతర రాష్ట్రాలకు జనవరి 8వ తేదీ నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారని, ప్రయాణికుల భద్రతదృష్ట్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2153 బస్సులు అలాగే బెంగళూరు నుంచి 375 బస్సులను , విజయవాడ నుంచి 300 స్పెషల్ బస్సులు నడపనున్నారు.

అదే విధంగా తిరుగు ప్రయాణానికి జనవరి 16వ తేదీ నుంచి జనవరి 20 వరకు 3200 అదనపు బస్సులు నడపనున్నామని ఆయన తెలిపారు.

 అంతే కాకుండా ఈ ప్రత్యేక బస్సులకు ఛార్జీలు పెంచుతారేమో అని భయపడాల్సిన అవసరం లేదు, స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే వారికి సాధారణ ఛార్జిలే ఉంటాయన్నారు.

అలాగే టికెట్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, ముఖ్యంగా ఒకేసారి రెండు వైపుల టికెట్ బుక్ చేసుకున్నవారికి, 10శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.