ఆరోగ్యానికి యోగా.. ఆనందానికి ధ్యానం.. ఈ రెండింటి శక్తి తెలుసా?
21 June 2026
Rajashekher
ఒత్తిడి, ఆందోళనకు చెక్: ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక విశ్రాంతిని అందిస్తుంది.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుదల: క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత మెరుగుపడి జ్ఞాపకశక్తి బలపడుతుంది.
సానుకూల ఆలోచనలకు దారి: ప్రతికూల భావాలను తగ్గించి ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
భావోద్వేగాల నియంత్రణ: కోపం, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ధ్యానం సహాయపడుతుంది.
యోగా జీవనశైలిలో కీలక భాగం: యోగా కేవలం వ్యాయామం కాదు; శరీరం, మనసును సమన్వయం చేసే జీవన విధానం. అందులో ధ్యానం ప్రధాన సాధనం.
రోజుకు 5 నిమిషాలు చాలు: ధ్యానం కోసం గంటల సమయం అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు కేటాయించినా మంచి ఫలితాలు పొందవచ్చు.
శ్వాసపై ధ్యాసతో ప్రారంభించండి: కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనస్సు క్రమంగా ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.
ఓంకార జపం ప్రత్యేక ప్రయోజనాలు: ఓంకార ధ్వని శరీరంలో సానుకూల కంపనాలను సృష్టించి ఏకాగ్రత, మానసిక ప్రశాంతతను పెంచుతుందని చెబుతారు.
కులమతాలకు అతీతమైన సాధన: ధ్యానం, ఓంకార నాదం విశ్వజనీనమైనవి. ఎవరికైనా, ఎక్కడైనా ఆచరించగలిగే మానసిక ఆరోగ్య సాధనం.
మరిన్ని వెబ్ స్టోరీస్
దానిమ్మ ఆరోగ్యానికి వరమే.. కానీ, ఈ రోగులకు మాత్రం శాపం! –
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!