ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయిన మెహ్రీన్.. వీధుల్లో ఏంటీ ఆ అల్లరి!
samatha
08 february 2025
Credit: Instagram
మెహ్రీన్ ఫిర్జాదా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో వరస సినిమాలో ఫుల్ బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ కు ప్రస్తుతం ఆఫర్స్ రావడం లేదని తెలుస్తోంది.
ఈ అమ్మడు మొదట్లో మహానుభావుడు, రాజాది గ్రేట్, జవాన్, పంతం, కవచం, ఎఫ్2,ఎంత మంచివాడవురా, లోకల్ బాయ్, అశ్వద్థామ, మంచిరోజులు వచ్చాయి వంటి సినిమాల్లో నటించింది
ఇక ఏ సినిమాకు రాని ఫేమ్ ఈ ముద్దుగుమ్మకు అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ఎఫ్1, ఎఫ్2 వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయినా ఈ అమ్మడుకు ఆఫర్స్ మాత్రం లేవు. అయితే సినిమాల పరంగా మెహ్రీన్ అభిమానులకు దూరంగా ఉన్నా, వరస ఫొటో షూట్స్‌తో మాత్రం వారిని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీ వీధుల్లో తిరుగూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ సూట్‌లో ఈ అమ్మడు చూడముచ్చటగా ఉంది.
ఢిల్లీ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ.. అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ, హనీ పాప.
ప్రస్తుతం ఈ ఫొటోలునెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఎఫ్2 బ్యూటీ చాలా క్యూట్ ఉంది అంటున్నారు కొందరు. మరి మీరు ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.