దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

12 September, 2025

Subhash

తెలంగాణలో విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతులేస్తారు. సెలవుల్లో ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధమవుతుంటారు.

తెలంగాణలో

గత నెల ఆగస్ట్‌లో విద్యా సంస్థలకు చాలా సెలవులు వచ్చాయి. వివిధ పండగలు, ఇతర సందర్భాలలో సెలవులు వచ్చాయి.

విద్యా సంస్థలకు 

ఈ నెల సెప్టెంబర్‌లో కూడా విద్యార్థులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. మరి కొన్ని రోజుల్లో తెలంగాణలో దసరా సెలవులు రానున్నాయి.

సెప్టెంబర్‌లో 

ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఈ సెలవుల గురించి  ప్రకటించింది. అయితే ఆ సమయం కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం

ఈ నేపథ్యంలో తెలంగాణలో దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

దసరా సెలవులను

ఇక సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబర్‌ 28 నుంచి

ఇప్పటికే దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 

దసరాకు 

ఇప్పటికే హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు బస్సులు, రైళ్లలో బుకింగ్స్ జరుగుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో