మీకు జ్ఞాపక శక్తి పెరగాలా?..మార్నింగ్ లేవగానే ఈ టిప్స్ పాటించండి మరి!
samatha
19 February 2025
Credit: Instagram
మెదడు ఉత్తేజంగా పనిచేయడానికి ప్రతి రోజూ ఉదయాన్నే కొన్ని టిప్స్ పాటించాలంట. కొన్నిసార్లు మన మెదడు అలసిపోతుంది. దీంతో అసలు ఏపని సరిగా చేయాలనిపించదు.
అందువలన మనం మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మన మెదడు పనితీరు మెరుగుపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుందంట. కాగా, ఆ టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
మార్నింగ్ లేవగానే గ్లాస్ వాటర్ తాగాలంట. డీ హైడ్రేషన్ వలన మన మెదడు కాస్త మసకబారుతుంది.అందువల్ల, టీ తాగడానికి ముందు తప్పకుండా గ్లాస్ నీరు తాగాలి అంట.
ప్రతి రోజూ వ్యాయామం చేయడం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది. ముఖ్యంగా సూపర్ మ్యాన్ ఫోజ్ ఆసనం వేయాలంట. దీని వలన మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
టిఫిన్ చేయడానికి ముందు వాల్ నట్స్, బ్లూ బెర్రీలు, డార్క్ చాక్లెట్స్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిదంట.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన దీని వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఉదయం లేచిన తర్వాత ఒకసారి మీరు నిన్న చేసిన ఐదు పనులను వరుసగా గుర్తుచేసుకోవడం, ఒక చిన్న కోట్‌ను కంఠస్థం చేసుకుని, తర్వాత పునరావృతం చేయడం వలన మెదడు పనితీరు బాగుంటుంది.
ఉదయం లేవగానే ముందుగా నవ్వండి. నవ్వడం వల్ల డోపమైన్ పెరుగుతుంది, ఇది జ్ఞాపకశక్తి, ప్రేరణను పెంచే న్యూరోట్రాన్స్మిటర్. మార్నింగ్ నవ్వడం వలన మన మైండ్ షార్ప్ గా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు.