గూగుల్‎లో ఈ సెట్టింగ్ పెట్టుకుంటే మీ ఫోన్ సేఫ్!

21 April 2025

Prudvi Battula 

ప్రస్తుతం అంతా గూగుల్ ద్వారానే జరుగుతుంది. ప్రతి అవసరం మరేదైనా పని కావచ్చు. అది ఏదైనా వెతుకులాట కావచ్చు, షాపింగ్ కావచ్చు.

గూగుల్‎లో భద్రతా ఉండటం చాలా ముఖ్యం. మీరు గోప్యతా సెట్టింగ్‌లను సర్దుబాటు చేయకపోతే, మీ డేటా దొంగిలించే ప్రమాదం ఉంది.

గూగుల్‎ మీ లోకేషన్‌ను అన్ని సమయాల్లో ట్రాక్ చేయగలదు. దీన్ని ఆఫ్ చేయడానికి, మీరు సెట్టింగ్‌లు > గూగుల్ > లోకేషన్ > లోకేషన్ హిస్టరీ > ఆఫ్‌పై క్లిక్ చేయాలి. ఇది మీ లోకేషన్ సేవ్ చేయదు.

మీ బ్రౌజింగ్, యాప్ వినియోగం గురించి సమాచారాన్ని గూగుల్ సేవ్ చేస్తుంది. ఇది సేవ్ అవకుండా ఎలా చేయడం మంచిది.

దీన్ని ఆఫ్ చేయడానికి: myactivity.google.com > వెబ్ & యాప్ యాక్టివిటీ > పాజ్ చేయండి. ఇది మీ ఆన్‌లైన్ కార్యకలాపాలను సురక్షితంగా ఉంచుతుంది.

మీ సమాచారం ఆధారంగా గూగుల్ ప్రకటనలను చూపుతుంది. దీన్ని ఆఫ్ చేయడానికి, సెట్టింగ్‌లు > గూగుల్ > ప్రకటనలు > ప్రకటనల వ్యక్తిగతీకరణను నిలిపివేయి క్లిక్ చేయండి.

ఎల్లప్పుడూ బలమైన పాస్‌వర్డ్ లేదా వేలిముద్ర లాక్‌ని ఉంచండి. తెలియని యాప్‌లను ఎప్పుడు డౌన్‌లోడ్ చేయవద్దు.

గూగుల్‎లో ఖాతాలో 2-దశల ధృవీకరణను సక్రియం చేయండి. మీ యాప్‌లు, సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి.