27 February 2025
Subhash
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi త్వరలో తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఫోన్ Xiaomi 15 సిరీస్‌ను విడుదల చేయబోతోంది.
ఈ సిరీస్‌లో Xiaomi 15, Xiaomi 15 Ultra వంటి రెండు మోడల్‌లు ఉంటాయి. ఈ ఫోన్ మార్చి 2న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో వస్తుంది.
ఫోన్ వెనుక ప్యానెల్‌లో వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో నాలుగు కెమెరా సెన్సార్లు, LED ఫ్లాష్ ఉన్నాయి. Xiaomi దాని మునుపటి అల్ట్రా సిరీస్ డిజైన్ గుర్తింపును తెచ్చుకోనుంది.
ఈసారి వెనుక ప్యానెల్ ఎగువ ఎడమ మూలలో ఇటాలిక్ అల్ట్రా బ్రాండింగ్ ఉండనుంది. Xiaomi 15 Ultra ఇటీవల Geekbench AI డేటాబేస్‌లో కనిపించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఉండనుంది.
ఈ ఫోన్ 16GB RAM కలిగి ఉంటుంది. Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనికి 50MP 1-అంగుళాల సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్.
50MP Samsung ISOCELL JN5 అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP సోనీ IMX858 టెలిఫోటో లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇది 200MP Samsung ISOCELL HP9 సెన్సార్
షియోమి 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌తో రానుంది. Xiaomi 15 Ultra ప్రారంభ ధర CNY 6,499 (దాదాపు రూ.77,700)
భారత్‌లో Xiaomi 14 Ultra (16GB+512GB)ని రూ. 99,999 ధరకు విడుదల చేసింది. Xiaomi 15 Ultra ప్రీ-ఆర్డర్ బుకింగ్ ఇప్పటికే చైనాలోని Mi మాల్‌లో ప్రారంభమైంది.