ఆక్సియం-4 మిషన్ ఎందుకు పదే పదే వాయిదా పడుతోంది?

13 June 2025

Prudvi Battula 

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు తీసుకెళ్లే ఆక్సియం-4 అంతరిక్ష నౌక వాయిదా పడింది.

స్పేస్‌ఎక్స్-భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా అందించాయి.

జూన్ 11, 2025న ప్రారంభించాల్సిన ఆక్సియం-4 మిషన్ వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.

ఫాల్కన్-9 రాకెట్‌లో సాంకేతిక లోపం కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మిషన్ వాయిదా పడిందని అన్నారు అధికారులు.

ఆక్సియం-4 అంతరిక్ష నౌక బయలుదేరడానికి ముందు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ (LOx) లీక్‌ను గుర్తించారు.

అంతకు ముందు ఆక్సియం-4 మిషన్ మే 29న జరగాల్సి ఉంది. ఆరోజున కూడా కొని కారణాల వల్ల వాయిదా పడటం జరిగింది.

రాకేష్ శర్మ అడుగుజాడల్లో నడుస్తూ, అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా శుభంషు శుక్లా నిలవబోతున్నారు.

1984లో సోవియట్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన రాకేష్ శర్మ అడుగుజాడలను శుభంషు శుక్లా నడిచి చరిత్ర సృష్టించబోతున్నారు.