19 January 2025
Subhash
తాజాగా సోలార్ పవర్‌తోనూ నడిచే కారు వచ్చేసింది. ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది.
వేవ్ ఇవా (Vayve Eva) కారు మూడు వేరియంట్లు - నోవా (Nova), స్టెల్లా (Stella), వెగా (Vega) వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.3.25 లక్షల (ఎక్స్ షోరూమ్) ఉంటుంది.
కారు సబ్‌స్క్రిప్షన్‌లు ప్రారంభం అయ్యాయి. బ్యాటరీ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. అంటే కారు ధర రూ.6 లక్షల వరకూ పలుకుతుందని భావిస్తున్నారు.
ఈ ధరలు తొలి 25 వేల మంది కస్టమర్లకు మాత్రమే పరిమితం అని వేవ్ (Vayve) తెలిపింది. ఇందులో అద్భుతమైన ఫీచర్స్‌ను పొందుపర్చినట్లు తెలుస్తోంది.
తొలుత 2023 ఎక్స్‌పోలోనే వేవ్ మొబిలిటీ తన సౌర విద్యుత్ వినియోగ కారు ఇవాను ఆవిష్కరించింది. పట్టణ ప్రాంతాల్లో పర్యటించే వారికి సుస్థిరమైన ట్రావెలింగ్ ఆప్షన్.
సింగిల్ చార్జింగ్‌తో 250 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ కారు. సౌర విద్యుత్‌తో పని చేయడం వల్ల అదనంగా 3,000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందీ కారు.
వేవ్ ఇవా కారు హై ఓల్టేజ్ పవర్‌ట్రైన్ మోటారుతో వస్తోంది. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో కేవలం ఐదు నిమిషాల చార్జింగ్‌తో 50 కి.మీ దూరం అదనంగా ప్రయాణించవచ్చు.
సగటున ప్రతి రోజూ 35 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. మోడర్న్ ఫ్యామిలీకి కోసం ఇన్నోవేషన్‌తో రూపొందించిన అర్బన్ వెహికల్ ఇది అని వేవ్ మొబిలిటీ సీఈఓ కం కో ఫౌండర్ నీలేశ్ బజాజ్ చెప్పారు.