09 March 2025
Subhash
రైలులో ప్రయాణించాలనుకునే వారందరూ ముందుగా ఐఆర్ సీటీసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలోకి లాగిన్ అవ్వండి.
మీరు ఎక్కాల్సిన రైలు పేరు, నంబర్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో వేర్వేరు రైలు నంబర్లు, మార్గాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే వాటిని సేవ్ చేసుకోండి
కన్ఫర్మ్ టిక్కెట్లను పొందడం కోసం ముందుగానే ప్రయాణికుల మాస్టర్ లిస్ట్‌ను సిద్ధం చేయాలి. దీనిలో ప్రయాణించేవారి పేర్లు, బెర్త్ ప్రాధాన్యతలు, ఆహార ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు.
ఈ సమాచారమంతా ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ సమయం ఆదా అవుతుంది.
దీంతో త్వరగా టికెట్లు బుక్ అవుతాయి. ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ అనే విభాగానికి వెళ్లడం ద్వారా మాస్టర్ జాబితాను తయారు చేసుకోవచ్చు.
టిక్కెట్ల సొమ్మును త్వరితగతిన చెల్లించడానికి యూపీఐ వాలెట్ ఉపయోగించడం మంచిది. దీని ద్వారా త్వరితగతిన చెల్లించే అవకాశం కలుగుతుంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ కన్నా ఇదే మంచి విధానం. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్, పాస్ వర్డ్, ఓటీపీ నమోదు చేయడానికి సమయం పడుతుంది.
అందుకే నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఐఆర్సీటీసీ ఇ-వాలెట్ కు డబ్బును పంపవచ్చు. ఈ విధంగా చేస్తే టికెట్స్ త్వరగా బుక్ అవుతాయి.