భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఈనెలలోనే హైడ్రోజన్‌ ఇంజిన్‌

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఈనెలలోనే హైడ్రోజన్‌ ఇంజిన్‌

08 March 2025

image

Subhash

భారత రైల్వేలు మార్చి 31 నాటికి దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

భారత రైల్వేలు మార్చి 31 నాటికి దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

హైడ్రోజన్

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశాన్ని జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలతో పాటు గ్రీన్ మొబిలిటీ దేశాల సరసన చేరుస్తుంది.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశాన్ని జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలతో పాటు గ్రీన్ మొబిలిటీ దేశాల సరసన చేరుస్తుంది.

పర్యావరణం

రైల్వే మంత్రిత్వ శాఖ 2023-24లో 35 హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైళ్ల సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి రూ.2,800 కోట్లు కేటాయించింది.

రైల్వే మంత్రిత్వ శాఖ 2023-24లో 35 హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైళ్ల సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి రూ.2,800 కోట్లు కేటాయించింది. 

రైల్వే మంత్రిత్వ శాఖ

ఈ రైళ్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిందని, ఈ సాంకేతికత పూర్తిగా భారతదేశంలోనే తయారైందని చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.

రైలు

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఈ రైలును నిర్మిస్తోంది. ఉత్తర రైల్వేకు సంబంధించిన ఢిల్లీ డివిజన్ ద్వారా జింద్-సోనిపట్ మార్గంలో దాదాపు 89 కి.మీ.ల దూరం నడుస్తుంది. 

కోచ్ ఫ్యాక్టరీ

ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా ఉండనుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా కూడా ఉండనుందన్నారు మంత్రి.

హైడ్రోజన్

ఈ హైడ్రోజన్ రైలు అద్భుతమైన 1,200 హార్స్‌పవర్‌తో నడుస్తుంది. ఇతర దేశాలలో నడుస్తున్న ఇలాంటి హైడ్రోజన్ రైళ్ల బలం కంటే రెట్టింపు కంటే ఎక్కువ.

హార్స్‌పవర్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్-శక్తితో నడిచే రైళ్లలో చాలా వరకు 500 నుంచి 600 హెచ్‌పీ మధ్య సామర్థ్యం కలిగిన ఇంజిన్‌లను కలిగి ఉంటాయి.

ఇంజిన్‌