నల్ల దారం శనిదేవునికి ప్రతీక. దీన్ని కాలికి ధరించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పించడంతో పాటు ఆధ్యాత్మిక అవగాహనను, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం.
జ్యోతిష్యం ప్రకారం ఎడమ కాలుకు నల్ల దారం కట్టుకుంటే చెడు దృష్టి, ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని పెద్దలు అంటున్నారు.
నల్ల దారన్ని ఎడమ కాలుకు ధరిస్తే అదృష్టం, శ్రేయస్సు, సమృద్ధిని ఆకర్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు పండితులు.
కొందరు నల్ల దారన్ని కాలికి కట్టుకుంటే ద్రవ్య సమస్యలను దూరం చేసి ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
కిలికి నల్ల దారం కడితే రాహువు, కేతువుల ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందన్నది హిందూ పండితులు చెబుతున్న మాట.
కొందరు నమ్మకం ప్రకారం.. కాలికి నల్ల దారం ధరిస్తే సానుకూల శక్తి ప్రవాహాన్ని మెరుగుపరిచి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.
ఎడమ కాలుకు నల్ల దారం ధరించడం శుభప్రదమని అంటారు. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనకరం అని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం.
సైన్స్ కోణంలో చూస్తే కాలికి కట్టే నల్ల దారం కాళ్ళ గాయాలు వైద్యం చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.